అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో నిర్మాత పి. కిరణ్ ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్, తేజ సూపర్‌హిట్ కాంబినేషన్ మళ్లీ సెట్టయింది. గీత రచయిత చంద్రబోస్, ఆర్.పి పట్నాయక్, తేజ... ముగ్గురూ కలసి మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టలో సంగీత చర్చలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆర్.పి పట్నాయక్ ఫేస్బుక్లో షేర్ చేసి ‘అదిరిపోయే మ్యూజిక్కు కాంబో సెట్ అయింది. రాబోయే చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్ధమౌతున్నాం. మీ అంచనాలను అందుకుంటాం. త్వరలో అప్డేట్స్ ఇస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని తెలిపారు.