విజయ్‌ సేతుపతిని నిరాశపరిచిన చిత్రాలు!

ABN , First Publish Date - 2021-09-21T18:39:26+05:30 IST

కోలీవుడ్‌లో దశాబ్ధానికిపైగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కలిగిన నటుడు విజయ్‌ సేతుపతి. ఆరంభంలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఆయన... ‘తెన్‌మేర్కు పరువకాట్రు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు.

విజయ్‌ సేతుపతిని నిరాశపరిచిన చిత్రాలు!

కోలీవుడ్‌లో దశాబ్ధానికిపైగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కలిగిన నటుడు విజయ్‌ సేతుపతి. ఆరంభంలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఆయన... ‘తెన్‌మేర్కు పరువకాట్రు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. ఆ తర్వాత 2012లో విడుదలైన ‘పిజ్జా’ మూవీతో ఒక్కసారిగా సూపర్‌ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన వెనక్కితిరిగి చూడలేదు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా, చిన్నచిన్న పాత్రలే కాకుండా విలన్‌గా కూడా నటిస్తూ తమిళ చిత్రపరిశ్రమలో అత్యంత బిజీగా మారిపోయారు.  అయితే, 2018లో వచ్చిన ‘96’ మూవీ తర్వాత విజయ్‌ సేతుపతి నటించిన అనేక చిత్రాలు నిరాశపరిచాయి. అయినప్పటికీ ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. 


అదేసమయంలో స్టార్‌ హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రంలో విలన్‌గా కనిపించారు. ఇందులో హీరో కంటే విలన్‌ పాత్రకే అధిక ప్రశంసలు దక్కాయి. ఇదిలావుంటే, ఈ నెలలోనే ఆయన నటించిన మూడు చిత్రాలు వరుసగా రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ఒకటి లాభం. ఈ మూవీ థియేటర్‌లో విడుదలైంది. అలాగే, ‘తుగ్లక్‌ దర్బార్‌’ తొలుత టీవీలో ప్రసారమై ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది. గత శుక్రవారం ‘అనబెల్‌ సేతుపతి’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల అంచాలను అందుకోలేకపోయాయి. 


వాస్తవానికి ఈ చిత్రాల గురించి సినీ విశ్లేషకులు రాసిన రివ్యూలకంటే నెటిజన్స్‌ చేసిన కామెంట్సే కాస్త కఠువుగా ఉన్నాయి. పైగా విజయ్‌ సేతుపతికి ఏమైంది? ఇలాంటి సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారు? అధిక చిత్రాల్లో నటించాలన్న ఆశతోనే కథల ఎంపికలో విజయ్‌ సేతుపతి పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు వచ్చాయి. అదేసమయంలో ఈ మూవీలో విజయ్‌ సేతుపతి నటన కూడా ఆశించిన స్థాయిలో లేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే, విజయ్‌ సేతుపతి నటించిన ‘కడైసి వివసాయి’, ‘మామనిదన్‌’, ‘యాదుమ్‌ ఊరే యావరుమ్‌ కేలీర్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలైన ప్రేక్షకుల ఆశించిన స్థాయిలో ఉండాలని కోరుకుందాం.

Updated Date - 2021-09-21T18:39:26+05:30 IST