కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్న ఓ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఆయనతో ఆడి పాడనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో వరుసగా సినిమాలను కమిటవుతున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా రూపొందబోతోంది. సాయి పల్లవి హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా ఆయన ఆల్రెడీ ఓ తమిళ మూవీని ఒకే చేశాడట. కోలీవుడ్ దర్శకుడు మిత్రన్ జవహర్ దీనికి దర్శకత్వం వహించనుండగా, ధనుష్ 44వ చిత్రంగా తెరకెక్కబోతోంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నట్టు సమాచారం. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నిత్యా మీనన్, హన్సిక, ప్రియా భవాని శంకర్ ఇందులో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మేకర్స్ నుంచి మాత్రం రాలేదు.