యాక్షన్ డైనమైట్ గోపీచంద్ (Gopichand), కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి (Maruthi) తొలి కలయికలో తెరకెక్కుతోన్న పక్కా కామెడీ ఎంటర్ టైనర్. ‘పక్కా కమర్షి్యల్’ (Pakka Commercial). తన కెరీర్ లోనే తొలిసారిగా గోపీ లాయర్‌గా నటిస్తుండగా.. కథానాయిక రాశీఖన్నా (Rashi Khanna) సైతం వకీల్ గానూ మెప్పించబోతోంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ట్రైలర్.
సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్ర పోషిస్తుండగా.. రావురమేశ్ (Rao Ramesh) విలన్‌గా అదరగొట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలు క్యామియో రోల్స్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం సౌత్‌లో నెగెటివ్ పాత్రలు చేయడంలో మంచి డిమాండ్ ఉన్న నటీమణి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sharathkumar). ‘తెనాలి రామకృష్ణ, క్రాక్, నాంది’ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వరు.. ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా.. పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. అలాగే.. మాస్ మహారాజా రవితేజ (Raviteja) ‘నేనింతే’ (Neninthe) చిత్రంలో హీరోయిన్ గా నటించిన శియా గౌతమ్ (Shiya Gowtham) కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. ఇంకా ‘తెల్లారితే గురువారం, రంగులరాట్నం’ లాంటి చిత్రాల్లో కథానాయికగా మెప్పించిన చిత్రా శుక్లా (Chitra Shukla) సైతం చెప్పుకోదగ్గ పాత్ర చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తం మీద ‘పక్కా కమర్షి్యల్’ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు హైలైట్ కానున్నారన్నమాట.