చనిపోతానేమో అనుకున్నా!

ABN , First Publish Date - 2021-12-08T07:11:31+05:30 IST

‘‘నేను చాలా బలహీనురాల్ని అనుకుంటా. కానీ నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యల్ని చూస్తే.. నాలో ఇంత ధైర్యం ఉందా అనిపిస్తోంది. మానసికంగా ఎంత ధృఢంగా ఉన్నానో అర్థం అవుతోంది..

చనిపోతానేమో అనుకున్నా!

‘‘నేను చాలా బలహీనురాల్ని అనుకుంటా. కానీ నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యల్ని చూస్తే.. నాలో ఇంత ధైర్యం ఉందా అనిపిస్తోంది. మానసికంగా ఎంత ధృఢంగా ఉన్నానో అర్థం అవుతోంది’’ అన్నారు సమంత. ఇటీవల సోషల్‌ మీడియాలో తన భావాల్ని నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తున్నారామె. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరవాత భావోద్వేగభరితమైన పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా సమంత కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘‘చైతూతో విడిపోయిన రోజులు నాకింకా గుర్తున్నాయి. అప్పుడు చాలా కృంగిపోయాను. చనిపోతానేమో అనిపించింది. కానీ.. అందులోంచి బయటపడ్డా. ఓ సమస్య ఎదురైతే దాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే జయించడానికి మార్గం దొరుకుతుంది. సమస్యని అంగీకరించాలి. లేదంటే అంతం లేని యుద్ధం చేస్తున్నట్టే’’ అని చెప్పుకొచ్చారు. కాలం, ఆ ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాలే తనని మరింత శక్తిమంతం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-08T07:11:31+05:30 IST