మా చిత్రానికి ఆ ముగ్గురూ మొనగాళ్లు!

ABN , First Publish Date - 2021-08-06T07:15:10+05:30 IST

‘‘మా చిత్రానికి నిర్మాత ‘వెన్నెల’ రామారావు, ఛాయాగ్రాహకుడు అంజి, దర్శకుడు అభిలాస్‌... ఆ ముగ్గురూ మొనగాళ్లు. ఇందులో ఛాలెంజిగ్‌ రోల్‌ చేశా....

మా చిత్రానికి ఆ ముగ్గురూ మొనగాళ్లు!

‘‘మా చిత్రానికి నిర్మాత ‘వెన్నెల’ రామారావు, ఛాయాగ్రాహకుడు అంజి, దర్శకుడు అభిలాస్‌... ఆ ముగ్గురూ మొనగాళ్లు. ఇందులో ఛాలెంజిగ్‌ రోల్‌ చేశా. కన్నడ ‘దియా’లో నటించిన దీక్షిత్‌, తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. అందరూ థియేటర్లలో చిత్రాన్ని చూడండి’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. దీక్షిత్‌ శెట్టి, ‘వెన్నెల’ రామారావుతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. శుక్రవారం విడుదల కానుంది. బుధవారం రాత్రి ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ‘‘ఒకరికి చెవిటి, ఇంకొకరికి మూగ, మరొకరు అంధుడు - ముగ్గురు వ్యక్తులను ప్రధాన పాత్రలుగా పెట్టి సినిమా తీయడం కొత్త విషయం. తప్పకుండా ప్రభుత్వం అందరికీ మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నా’’ అని వీడియో ద్వారా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. కె. రాఘవేంద్రరావు, వీవీ వినాయక్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ‘బిగ్‌బాస్‌’ సోహైల్‌, అరియానా, సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.


Updated Date - 2021-08-06T07:15:10+05:30 IST