Sirimalle Navvindi: విశ్వనాథ్ కాదంటే విజయ నిర్మలతో తీశారు

ABN , First Publish Date - 2022-05-04T00:04:29+05:30 IST

ముగ్గురు రచయితలు ఆదివిష్ణు (Aadi Vishnu), సింగరాజు రామచంద్రమూర్తి (Singaraju Rama Chandramurthy, హవీష్ (Havish).. కలసి రాసిన వివసువు (Vivasuvu) అనే గొలుసు కథ

Sirimalle Navvindi: విశ్వనాథ్ కాదంటే విజయ నిర్మలతో తీశారు

ముగ్గురు రచయితలు ఆదివిష్ణు (Aadi Vishnu), సింగరాజు రామచంద్రమూర్తి (Singaraju Rama Chandramurthy, హవీష్ (Havish).. కలసి రాసిన వివసువు (Vivasuvu) అనే గొలుసు కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘సిరిమల్లె నవ్వింది’ (Sirimalle Navvindi). ఈ చిత్ర నిర్మాణం వెనుక చిన్న కథ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna)కు లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao). అలాంటి ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో హీరో కృష్ణ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచి వారి బాగోగులు పర్యవేక్షించేవారు. కొన్ని సినిమాలు చేసి పెట్టారు. అయినా ఆయన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇక చిత్ర నిర్మాణం ఆపేసి, స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదుర్తి కుటుంబ సభ్యులు నిర్ణయించుకొన్నారు. 


ఈ విషయం హీరో కృష్ణకు తెలిసింది. నేనున్నానని ధైర్యం చెప్పి చిత్ర నిర్మాణం కొనసాగించమన్నారు. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు, దర్శకుడిగా ప్రముఖ స్థానంలో ఉన్న కే. విశ్వనాధ్ (K. Viswanath) దగ్గరకు వెళ్ళి సినిమా చేయమని అడిగారు ఆదుర్తి కుటుంబ సభ్యులు. కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు. వాళ్ల తరపున హీరో కృష్ణ కూడా వెళ్లి విశ్వనాధ్‪ని అడిగారు. ‘వాళ్ళు మీకు పారితోషికం ఇవ్వలేరేమోనని సందేహించకండి.. నాది బాధ్యత..’ అని కూడా చెప్పారు. అయినా విశ్వనాధ్ ఎందుకో ముందుకు రాలేదు. అప్పుడు విజయనిర్మల(Vijaya Nirmala) దర్శకత్వంలో ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రాన్ని తీశారు. హీరో కృష్ణ సరసన సుజాత (Sujatha) నటించిన ఏకైక చిత్రం ఇదే.

-వినాయకరావు

Updated Date - 2022-05-04T00:04:29+05:30 IST