'గని' ట్రాన్స్ఫర్మేషన్‌పై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..
ABN , First Publish Date - 2021-11-17T18:18:35+05:30 IST
'గని' ట్రాన్స్ఫర్మేషన్‌పై మెగాస్టార్ తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా రూపొందుతున్న సినిమా 'గని'. ఇందులో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నారు.

'గని' ట్రాన్స్ఫర్మేషన్‌పై మెగాస్టార్ తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా రూపొందుతున్న సినిమా 'గని'. ఇందులో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నారు. బాక్సర్ అంటే ఏ రేంజ్‌లో మేకోవర్ అవ్వాలో, బాడీ పరంగా ఎంత ఇంప్రూవ్ కావాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క సినిమా కోసం కొన్ని నెలలు వ్యాయామాలు చేసి పర్‌ఫెక్ట్ బాడీతో బాక్సర్‌గా తయారవ్వాలి. వరుణ్ అలాగే తయారయ్యాడు. ఈ సినిమా కోసం తనను తాను ఎంతగా మార్చుకున్నాడో తాజాగా విడుదలైన 'గని' టీజర్ చూస్తే అర్థమవుతోంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్‌పై వరుణ్.. ఒక పాత్ర కోసం తాను చేసిన హార్డ్ వర్క్ అలాగే ప్యాషన్ ఏంటీ అనేది తెలుస్తుంది".. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే చిత్ర యూనిట్‌కి, వరుణ్ తేజ్‌కి గని చిత్రం పెద్ద విజయం సాధించాలి అని చిరు తెలిపారు.