Super Star Krishna: ఆయన ధైర్యానికి ఇదొక ఉదాహరణ

ABN , First Publish Date - 2022-11-15T21:55:25+05:30 IST

హీరో కృష్ణ (Hero Krishna) దమ్మున్న హీరో, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని ఎందుకు అంటారో తెలిపే మరో ఉదాహరణ ఇది. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో..

Super Star Krishna: ఆయన ధైర్యానికి ఇదొక ఉదాహరణ

హీరో కృష్ణ (Hero Krishna) దమ్మున్న హీరో, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని ఎందుకు అంటారో తెలిపే మరో ఉదాహరణ ఇది. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం.. ఆ ఉద్యమానికి మద్దతు తెలపడానికి భయపడితే.. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మాత్రం డేరింగ్‌గా మద్దతు తెలపడమే కాకుండా.. ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి ఫొటో ఇది. ఈ ఒక్క సందర్భమే కాదు.. సినిమాల విషయంలోనే కాకుండా.. ఇలాంటి పలు సంఘటనలలో ఆయన చూపించన ఘట్స్.. ఆయనని డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోని చేశాయి.


ఆయన ఘట్స్ గురించి తాజాగా రాజమౌళి స్పందిస్తూ.. 300కి పైగా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి కృష్ణగారు చేసిన కృషి అందరికీ తెలిసిందే. కొత్త టెక్నాలజీల పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, అభిరుచి ఆయనని మిగిలిన వారి నుండి వేరుగా ఉంచుతుంది. అలాగే.. వాటిని ఉపయోగించడానికి ఆయన ఘట్స్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన మొదటి 70ఎంఎం చిత్రం, మొదటి కలర్ మూవీ.. ఇంకా అనేక ఇతర చిత్రాలతో తెలుగు సినిమాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసే క్రమంలో ఏ మాత్రం భయపడొద్దనేదానికి స్ఫూర్తి సూపర్ స్టార్ కృష్ణగారే అని దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కొనియాడారు. 





Updated Date - 2022-11-15T21:55:25+05:30 IST