అమ్మకోసం చేసిన సినిమా ఇది

ABN , First Publish Date - 2022-09-26T06:32:06+05:30 IST

అమ్మకోసం చేసిన సినిమా ఇది

అమ్మకోసం చేసిన సినిమా ఇది

‘ధనుష్‌, నువ్వు కలసి ఓ సినిమా చేయండి అని అమ్మచెప్పడంతో ‘నేనే వస్తున్నా’ చిత్రం చేశాను. 11 సంవత్సరాల తర్వాత మళ్లీ ధనుష్‌ సినిమాను డైరెక్ట్‌ చేశాను’ అని సెల్వరాఘవన్‌ అన్నారు. ధనుష్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెల్వరాఘవన్‌ సినిమా విశేషాలు పంచుకున్నారు. 


ఇప్పుడు హీరోగా ధనుష్‌ స్థాయి పెరిగింది. బాలీవుడ్‌, హాలీవుడ్‌ యాక్టర్‌ అయ్యాడు. మేమిద్దరం కలసి రాసిన కథతో ఓ సినిమా చేయాలని ధనుష్‌ కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను ఇప్పటిదాకా ఎవరితోనూ కలసి కథ రాయలేదు. తొలిసారి తమ్ముడితో కలసి రాశాను. తను చాలా సెన్సిటివ్‌ రైటర్‌. 


ధనుష్‌ రెండోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది. భిన్న భావోద్వేగాలు, ఛాయలు ఉన్న పాత్రలు అద్భుతంగా పోషించాడు. ఇద్దరు వేర్వేరు వ్యక్తులను చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాను. ధనుష్‌ కోసమే ఈ  పాత్రలో నటించాను. 

Updated Date - 2022-09-26T06:32:06+05:30 IST