ఇది ఫ్రస్టేషన్‌ సాంగ్‌

ABN , First Publish Date - 2022-10-20T05:36:02+05:30 IST

సంజయ్‌రావు హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌’. ప్రణవీ మానుకొండ కథానాయిక...

ఇది ఫ్రస్టేషన్‌ సాంగ్‌

సంజయ్‌రావు హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌’. ప్రణవీ మానుకొండ కథానాయిక. పూరి జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏ. ఆర్‌ శ్రీధర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మాతలు. బ్రహ్మాజీ, సప్తగిరి కీలకపాత్రలు పోషిస్తున్నారు.  చిత్రీకరణ తుదిదశలో ఉంది. ‘స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌’ నుంచి ఫ్రస్టేషన్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని అందించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపర్చి, రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలసి పాడారు. ఈ పాటలో సునీల్‌ స్పెషల్‌ అప్పీయరెన్స్‌ చేయడం విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ జె. రెడ్డి


Updated Date - 2022-10-20T05:36:02+05:30 IST