చిరుదే... ఈ డిసెంబరు!

చిరంజీవి కెరీర్‌లో అరుదైన నెల... ఈ డిసెంబరు. ఎందుకంటే.. ఒకేసారి నాలుగు సినిమాలకు సంబంధించిన షూటింగుల్లో ఆయన పాలు పంచుకుంటున్నారు. చిరు ‘ఆచార్య’గా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ కూడా సెట్స్‌పైకి వెళ్లాయి. ఇటీవల బాబి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ నాలుగు సినిమాల షూటింగులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ఈనెలలో అన్నింటికీ సరిపడ డేట్లు కేటాయించారు చిరు. ఒకే నెలలో నాలుగు సినిమాల షూటింగుల్లో పాల్గొనడం చిరు కెరీర్‌లో ఇదే తొలిసారి. అందుకే ఈ డిసెంబరు కాస్త మెగాస్టార్‌ నెలగా మారిపోయింది. చిరు నటిస్తున్న ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ వెంటనే ‘గాడ్‌ ఫాదర్‌’ కూడా రాబోతోంది. 2022లో చిరు నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.