Katrina Kaif నుంచి.. ఐశ్వర్యరాయ్ వరకు.. భర్తల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న హీరోయిన్ల లిస్ట్ ఇదీ.. ఎవరెవరికి ఎంత ఆదాయం అంటే..

ప్రియుడు విక్కీ కౌశల్‌ని కత్రీనా డిసెంబర్ 9న పెళ్లాడనుంది. అయితే, అతడి కంటే ఆమె కొంచెం వయస్సులో పెద్ద. అదొక్కటే కాదు... బాలీవుడ్‌లోనూ కత్రీనా సీనియర్. ఇక క్యాట్ మరో విషయంలోనూ విక్కీ కంటే ముందే ఉంది! అదే... ఆదాయం! ఓ అంచనా ప్రకారం మన ‘మల్లీశ్వరి’ సంవత్సరానికి 224 కోట్లు ఆర్జిస్తోందట! మరి విక్కీ కౌశల్? ఈ మధ్యే సక్సెస్‌ని టేస్ట్ చేసిన ‘యురి’ యాక్టర్ 25 కోట్లే సంపాదిస్తున్నాడు. అంటే, కాబోయే భార్యాభర్తల మధ్య భారీగా తేడా ఉన్నట్టే లెక్క!


భర్త కంటే బోలెడు డబ్బులు ఎక్కువగా సంపాదించే భార్యలు బాలీవుడ్‌లో కత్రీనాకి ముందు కూడా ఉన్నారు. వాళ్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ సుందరి ఐశ్వర్య గురించి. ఒక దశలో బాలీవుడ్ నెంబర్ వన్ బ్యూటీగా కొనసాగిన బీ-టౌన్ స్టార్ సినిమాల కంటే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్స్‌తో సంపాదిస్తోంది. ఐష్ తలసరి ఆదాయం 227 కోట్లని సమాచారం. అభిషేక్ బచ్చన్ నెట్ వర్త్ మాత్రం 203 కోట్లేనట! 


తన భార్య కంటే చాలా చాలా తక్కువ సంపాదించే బాలీవుడ్ నటుల్లో కరణ్ సింగ్ గ్రోవర్ టాప్‌లో నిలుస్తాడు. ఇంతకీ, ఎవరాయన అంటారా? మరెవరో కాదు, బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాషా భర్త! ముందు ఆమె ఆదాయం ఎంతో తెలుసుకుందాం. బిపాషా సినిమాలు, యాడ్స్‌తో కలుపుకుని సంవత్సరానికి దాదాపుగా 113 కోట్లు పోగేస్తోంది. మరి టీవీ నటుడైన కరణ్ సింగ్ గ్రోవర్ ఈయర్లీ ఇన్‌కమ్ ఎంతో తెలుసా? జస్ట్ 13 కోట్లు!


తన భార్య కంటే అతి తక్కువ సంపాదించే అందగాడు కరణ్ సింగ్ గ్రోవర్ అయితే... దాదాపుగా శ్రీమతితో పోటీ పడుతోన్న శ్రీమంతుడు, రణవీర్ సింగ్. ఈయన సంవత్సరానికి ఎలా చూసుకున్నా 307 కోట్లు కొల్లగొడుతుంటాడు. అయితే, రణవీర్ జీవితంలోకి గృహలక్ష్మిలా కాలుమోపిన దీపిక కాస్త ఎక్కువగా పోగేస్తో్ంది. ఆమె నెట్ వర్త్ 316 కోట్లు... 


ప్రజెంట్ బీ-టౌన్ గాళ్సే కాదు... నిన్నటి తరం డ్రీమ్ గాళ్ కూడా... హబ్బీ కంటే ఫాస్టే! మెంబర్ ఆప్ పార్లమెంట్ హేమా మాలిని దాదాపు 440 కోట్ల దాకా ఆర్జిస్తుండగా ఆమె భర్త ధర్మేంద్ర 335 కోట్ల మార్క్ వద్దే ఉన్నాడు. రోజురోజుకి ముంబై గ్లామర్ ప్రపంచంలో అందగత్తెల ఆర్దిక బలం పెరుగుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే!

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.