సమాజంలో అలాంటి సిత్రాలు ఉన్నాయి!

ABN , First Publish Date - 2021-09-26T05:30:00+05:30 IST

రాగ్‌... ఓ గిటారిస్ట్‌, సింగర్‌! పల్లవి... వ్యభిచారి! యశ్‌... బాక్సర్‌ అయితే దిలీప్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యమున్న వ్యక్తి. ఈ నలుగురి జీవితాలకు సంబంధం ఏమిటి? యశ్‌తో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యామిని ఎలా ప్రేమలో పడింది? అనే కథతో రూపొందిన సినిమా..

సమాజంలో అలాంటి సిత్రాలు ఉన్నాయి!

రాగ్‌... ఓ గిటారిస్ట్‌, సింగర్‌! పల్లవి... వ్యభిచారి! యశ్‌... బాక్సర్‌ అయితే దిలీప్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యమున్న వ్యక్తి. ఈ నలుగురి జీవితాలకు సంబంధం ఏమిటి? యశ్‌తో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యామిని ఎలా ప్రేమలో పడింది? అనే కథతో రూపొందిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. శ్వేతా పరాశర్‌, యశ్‌ పూరి, అజయ్‌ కతుర్వార్‌, ప్రవీణ్‌ యండమూరి, తన్వీ ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ‘‘సమాజాన్ని దగ్గర్నుంచి చూసి తీసిన చిత్రమిది. అలాంటి సిత్రాలు చూస్తున్నప్పుడు పాత్రల్ని సమాజంలో ఎక్కడో చూసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తాయి. కథతో పాటు సంగీతం, ఛాయాగ్రహణం వంటి సాంకేతిక అంశాల గురించి వీక్షకులు మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు సుప్రీత్‌ సి. కృష్ణ అన్నారు. లొక్కు శ్రీ వరుణ్‌, రాహుల్‌ రెడ్డితో కలిసి ఆయన చిత్రాన్ని నిర్మించారు. 

Updated Date - 2021-09-26T05:30:00+05:30 IST