AP exhibitors: వెండితెర నిండుదనం మరెక్కడా రాదు

ABN , First Publish Date - 2021-07-29T22:57:16+05:30 IST

సినీ ప్రియులకు శుభవార్త అందింది. తెలంగాణాలో ఇప్పటికే థియేటర్లలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 30 నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతినిచ్చింది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

AP exhibitors: వెండితెర నిండుదనం మరెక్కడా రాదు

30 నుంచి ఏపీలో సినిమాల ప్రదర్శన

50 శాతం కెపాసిటీతో కష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలి...

రూ. 5, 10కి సినిమా చూపించాలనడం కరెక్ట్‌ కాదు

13 జిల్లాల ఎగ్జిబిటర్లు సమావేశం..

ఎన్ని మాధ్యమాలున్నా.. వెండితెర నిండుదనం మరెక్కడా రాదు..


సినీ ప్రియులకు శుభవార్త అందింది. తెలంగాణాలో ఇప్పటికే థియేటర్లలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 30 నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతినిచ్చింది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లను నడిపించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అయితే 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడపడం కష్టమని థియేటర్‌ యజమానులు వాపోతున్నారు. ఈ కష్టం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 



ఎగ్జిబిటర్ల సమావేశం... పలు కీలక నిర్ణయాలు...

మరోవైపు ఎ.పిలో 13 జిల్లాల ఎగ్జిబిటర్లు థియేటర్‌ సమస్యలపై చర్చించడానికి సమావేశమయ్యారు. జీఓ 35 వల్ల థియేటర్లు నిర్వహించలేని స్థితి ఎదురైందని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ మాజీ సెక్రటరీ ఎన్‌.వి. ప్రసాద్‌ తదితరులు పేర్కొన్నారు. ఎటువంటి ఆదరణ లేని రంగం సినిమా రంగమనీ, బ్యాంకులు కూడా కనీస రుణం ఇవ్వవని ఆయన అన్నారు. తెలంగాణాలో లేని విధంగా ఏపీలో భారీగా సినిమా రంగానికి ఆస్తులు ఉన్నాయనీ, సినీ రాజఽధాని విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన అన్నారు. ఇంకా ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల వల్ల థియేటర్ల కరెంటు బిల్లులు కట్టలేక పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో సినిమాలు ప్రదర్శిస్తే ఎదురు పెట్టుబడి పెట్టాలి. అన్ని రకాల నిత్యావసరాలు పెరుగుతుంటే రూ. 5, 10కి సినిమా చూపించాలనడం కరెక్ట్‌ కాదు.  తెలుగు సినిమా స్టామినా అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. ఏపీలో కూడా తెలుగు సినిమా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకే విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంతకల్లు ప్రాంతాల్లో ఆస్తులు తీసుకున్నారు. సీఎం జగన్‌ మా సమస్యలకు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం’’ అని అన్నారు. 

ఓటీటీపై  ఎగ్జిబిటర్ల స్పందన..

‘‘నిర్మాతలకు తమ చిత్రాలను ప్రదర్శించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్‌ను మాత్రమే నమ్ముకున్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిని సినిమాను వెండితెర మీద చూసిన నిండుతనం మరెక్కడా రాదు. నిర్మాతలు కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నాం. కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. అదే సమయంలో థియటర్ల మనుగడ కూడా ముఖ్యం. ఆ దిశగా సినిమాలు ఆలోచించాలి’’ అని ఎగ్జిబిటర్లు అన్నారు. 


Updated Date - 2021-07-29T22:57:16+05:30 IST