ఈ వారం థియేటర్‌–ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

ABN , First Publish Date - 2022-03-21T22:45:02+05:30 IST

కరోనా తగ్గడం, టికెట్‌ రేట్ల సమస్య ఓ కొలిక్కి రావడంతో టాలీవుడ్‌లో పెద్ద చిత్రాల హవా మొదలైంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు వరుసకట్టాయి. ఈ వారం థియేటర్‌, ఓటీటీ వేదికగా విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

ఈ వారం థియేటర్‌–ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

కరోనా తగ్గడం, టికెట్‌ రేట్ల సమస్య ఓ కొలిక్కి రావడంతో టాలీవుడ్‌లో పెద్ద చిత్రాల హవా మొదలైంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు వరుసకట్టాయి. ఈ వారం థియేటర్‌, ఓటీటీ వేదికగా విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 


నాలుగేళ్ల క్రితం మొదలైన ’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఇప్పుడు ఎంత క్రేజ్‌ తెచ్చుకుందో తెలిసిందే! తారక్‌ రామ్‌చరణ్‌ లాంటి  స్టార్‌ హీరోలు ఈ చిత్రంలో నటించడం విశేషం. రాజమౌళి తెరకెక్కించిన ప్యాన్‌ ఇండియా చిత్రమిది. దానయ్య నిర్మించిన  ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ నాయికలు. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం కోసం భారత ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్‌ రేటు పెంచుకునే వెలుసుబాటు కల్పించింది. డి.వి.వి. దానయ్య  ఈ చిత్రానికి నిర్మాత. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అత్యధిక థియేటర్‌లలో విడుదల కానున్న కారణంగా మరే చిన్న చిత్రం ఈ వారం విడుదలకు నోచుకోలేదు. 


ఇప్పటికే థియేటర్‌లో విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన పలు చిత్రాలు ఈ వారం ఓటీటీలో విడుదల కానున్నాయి. ఆ చిత్రాల వివరాలు: 




పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రధారులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం భీమ్లానాయక్‌’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ నెల 25న ఆహా, డిస్నీ హాట్‌స్టార్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్‌–రానా పోటీపడి నటించిన నటన త్రివిక్రమ్‌ డైలాగ్‌లు హైలైట్‌గా నిలిచాయి. 




తమిళ హీరో అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన ‘వలిమై’ గత నెల 24న విడుదలైంది. ఈ చిత్రం కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఈ నెల 25న జీ5లో స్ర్టీమింగ్‌ కానుంది. ఇందులో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. 


ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌


డ్యూన్‌  (మార్చి 25)

నెట్‌ఫ్లిక్స్‌

బ్రిడ్జిటన్‌ (వెబ్‌సిరీస్‌2) మార్చి 25

హాట్‌స్టార్‌ 

పారలెల్స్‌ (మార్చి 23)

ఊట్‌

 హలో (వెబ్‌సిరిస్‌) మార్చి 23

Updated Date - 2022-03-21T22:45:02+05:30 IST