థియేటర్లు తెరిపిస్తా

ABN , First Publish Date - 2021-08-13T09:45:37+05:30 IST

‘‘ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్ట్‌ కాద నేవాళ్లకు నేను చెప్పేది ఒక్కటే... మూసిన థియేటర్లను మా సినిమాతో తెరిచేలా చేస్తా...

థియేటర్లు తెరిపిస్తా

‘‘ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్ట్‌ కాద నేవాళ్లకు నేను చెప్పేది ఒక్కటే... మూసిన థియేటర్లను మా సినిమాతో తెరిచేలా చేస్తా. అలా చేయలేకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని విష్వక్‌సేన్‌ అన్నారు. ఆయన హీరోగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ‘పాగల్‌’ శనివారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘‘ఈ కథ వినగానే కొత్తగా అనిపించి ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాను. విష్వక్‌ను చూసి నిర్మాతగా ఇంప్రెసయ్యాను’’ అని చిత్రసమర్పకుడు ‘దిల్‌’ రాజు చెప్పారు. ‘‘మామూలుగా శుక్రవారం సినిమాలు విడుదల చేస్తారు. మేము పాగల్‌ కదా... అందుకే శనివారం విడుదల చేస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ కోసం హీరో ప్రేమ్‌ జరిపిన ప్రయాణమే మా ‘పాగల్‌’ సినిమా. హీరోయిన్లు నివేదా పేతురాజ్‌, సిమ్రాన్‌ చౌదరి, మేఘా లేఖ చక్కగా నటించారు’’ అని విష్వక్‌ సేన్‌ అన్నారు. ‘‘పాగల్‌’... నిర్మాతగా నేను గర్వపడే, ప్రేక్షకులు ఇష్టపడే  సినిమా అవుతుంది’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కార్తికేయ, తేజా సజ్జా, శ్రీవిష్ణు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-13T09:45:37+05:30 IST