రామ్‌కు విలన్
ABN , First Publish Date - 2021-07-20T08:55:33+05:30 IST
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది...

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్‌ను ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ‘సరైనోడు’ తర్వాత ఆయన విలన్‌గా చేస్తున్న చిత్రమిది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘రామ్, ఆది మధ్య సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్టు ఉంటాయి. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో ఊర మాస్ సినిమాగా నిర్మిస్తున్నాం. ఈ నెల 12న హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించాం’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘‘మళ్లీ విలన్‌గా చేయాలంటే... పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలనుకున్నా. కథ, నా క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ నచ్చడంతో నటించడానికి అంగీకరించా. తెలుగులో కడప కుర్రాడిగా, తమిళంలో మధురై నేపథ్యంలో నా పాత్ర ఉంటుంది. లింగుస్వామి విలన్ పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు’’ అని చెప్పారు. కృతీ శెట్టి కథానాయికగా, నదియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.