థమన్‌ని రీప్లేస్ చేసిన తమిళ సంగీత దర్శకుడు..?

ABN , First Publish Date - 2021-09-02T14:20:02+05:30 IST

ప్రస్తుతం సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగుతున్న ఎస్ ఎస్ థమన్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవన్నీ భారీ ప్రాజెక్ట్సే.

థమన్‌ని రీప్లేస్ చేసిన తమిళ సంగీత దర్శకుడు..?

ప్రస్తుతం సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగుతున్న ఎస్ ఎస్ థమన్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవన్నీ భారీ ప్రాజెక్ట్సే. దాంతో ఓ చిత్రబృందం ఆయనను ముందు తమ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంచుకొని ఇప్పుడు ఆ ప్లేస్‌లో తమిళ సంగీత దర్శకుడిని తీసుకున్నారని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు థమన్‌ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. కానీ ఆయన మెగాస్టార్, పవర్ స్టార్, రాం చరణ్, మహేశ్ బాబు సహా పలువురు స్టార్ హీరోల సినిమాలను కమిటయి ఆ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. దాంతో ఆయనని కాదని ఇప్పుడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళను ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, దీపా రెడ్డి నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-09-02T14:20:02+05:30 IST