లఖింపూర్ ఖేరీ ఘటనను స్వ్కిడ్ గేమ్ తో పోల్చిన స్టార్ హీరో భార్య

ABN , First Publish Date - 2021-10-18T02:08:25+05:30 IST

అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో లఖింపూర్ ఖేరీ ఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. లఖింపూర్ ఖేరీ ఘటనను నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమయిన కొరియన్ వెబ్ సిరీస్ ‘‘ స్వ్కిడ్ గేమ్’’ తో పోల్చింది.

లఖింపూర్ ఖేరీ ఘటనను స్వ్కిడ్ గేమ్ తో పోల్చిన స్టార్ హీరో భార్య

జాతీయ, అంతర్జాతీయ అంశాలపై బాలీవుడ్ సెలెబ్రిటీలు తరచుగా స్పందిస్తుంటారు. కంగనా రనౌత్ తప్పకుండా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటుంది. లఖీంపూర్ ఖేరీ ఘటనపై ఒక స్టార్ హీరో భార్య, మాజీ హీరోయిన్ స్పందించింది. 


అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో లఖింపూర్ ఖేరీ ఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. లఖింపూర్ ఖేరీ ఘటనను నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమయిన కొరియన్ వెబ్ సిరీస్ ‘‘ స్వ్కిడ్ గేమ్’’ తో పోల్చింది. ఆ పోస్ట్ కింద..‘‘ భారత్‌లో మనం దేశీ వెర్షన్ స్వ్కిడ్ గేమ్ ఆడుతున్నాం. బాబా రామ్ దేవ్, అరవింద్ క్రేజీవాల్ వంటి వారిపై సిరాను చల్లిన వారి గురించి నేను ప్రస్తావించడం లేదు ’’ అని రాసింది. 


ఆమె ఒక జాతీయ మీడియా బ్లాగ్‌కు ‘‘ దేశీ స్వ్కిడ్ గేమ్ మొదలైంది ’’ అనే టైటిల్‌తో ఆర్టికల్‌ను రాసింది. బీజేపీకీ చెందిన ఒక మంత్రి కొడుకు లఖింపూర్ ఖేరీ‌లో రైతులను కారుతో ఢీ కొట్టించి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనను ‘‘స్వ్కిడ్ గేమ్’’ వెబ్ సిరీస్‌లో చివరిదైన గేమ్‌తో పోల్చింది. ‘‘ చివరిదైన గేమ్ ప్రజాస్వామ్య మైదానంలో అటాకర్స్, డిఫెండర్స్ ఆడుతున్నారు. ఎవరు అయితే ఆ మైదానాన్ని క్రాస్ చేస్తారో వారు చనిపోతారు. ఈ మధ్య దేశం లఖింపూర్ ఖేరీలో జరిగిన వైరల్ వీడియాలను చూసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వారిని కారుతో తొక్కించి చంపారు ’’ అని ట్వింకిల్ ఖన్నా రాసింది.


ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో కొంత మంది సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా రైతులను తన కారుతో ఢీ కొట్టించి  చంపేశారు. స్వ్కిడ్ గేమ్ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయిన కొరియన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో ఆరు గేమ్ లు ఉంటాయి. రెడ్ లైట్- గ్రీన్ లైట్, హనీ కోంబ్, టగ్ ఆఫ్ వార్, మార్బుల్స్,  స్టెప్పింగ్ స్టొన్స్ అనే గేమ్‌లు ఉంటాయి. ఆ గేమ్‌లల్లో ఓడిన వారిని ఎలిమినేట్ చేస్తుంటారు. ఎలిమినేట్ అంటే చంపేయడం అనే అర్థం. చివరగా ఆడే గేమ్ పేరే ‘‘ స్వ్కిడ్ గేమ్’’ .  ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను సంపాదించుకుంది.

Updated Date - 2021-10-18T02:08:25+05:30 IST