రిజెక్ట్ చేసిన సినిమాలే సూపర్ హిట్స్.. బాధగా లేదా అని Fahadh Faasilను అడిగితే ఇచ్చిన రెస్పాన్స్ ఇదీ..

బెంగళూరు: ఒకరు నటించవలసిన సినిమా అనేక కారణాలతో మరొకరి చెంతకు చేరుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మారే వారెందరో ఉంటారు. సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ తన  సినిమాల ఎంపికలో ఎప్పుడు విభిన్నతను ప్రదర్శిస్తుంటారు. ఇతర భాషాల్లోను ఆయనకు అభిమానులున్నారంటే అతిశయోక్తి లేదు. తాజాగా పుష్ప చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఆయన కూడా అనేక సినిమాలను రిజెక్ట్ చేశారు. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.  


తస్కరహా(2014), డబుల్ బ్యారెల్ (2015), ఇవిడే(2015) కథలు మొదట ఫహద్ ఫాజిల్ వద్దకే వెళ్లాయి. కానీ, అనేక కారణాలతో ఆయన ఈ సినిమాలను ఒప్పుకోలేదు. ఆయన రిజెక్ట్ చేసిన అనేక సినిమాల్లో అనంతరం పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేశారు. రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఫహద్ ఫాజిల్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..‘‘ ఆ కథలు నా దగ్గరికీ వచ్చినప్పుడు అవి హిట్ చిత్రాలు అని నాకు తెలుసు. కానీ, ఆ సినిమాలోని పాత్రలకు నేను సరిపోను. అందుకే ఆ చిత్రాలను రిజెక్ట్ చేశాను’’ అని వివరించారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.