అందరికీ కోరికలు ఉంటాయి.. కానీ ఆ కోరికలను లక్ష్యాలుగా మార్చుకుని ముందుకుసాగే వ్యక్తులు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఎవరూ ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వారి లక్ష్యాలను చేరుకుంటారు. అందులో ఒకరే చెన్నై శరవణ స్టోర్స్ యజమానుల్లో ఒకరైన అరుళ్ శరవణన్ (Arul Saravanan). ఈయనకి పెళ్లై భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు వున్నారు.
అయితే.. కొన్ని దశాబ్దాల క్రితం మొదలైన కుటుంబ వ్యాపారం శరవణ స్టోర్స్ అంతకంతకూ పెరుగుతూ సంపదని సృష్టిస్తూనే ఉంది. 1969లో ప్రారంభమైన ఈ స్టోర్స్‌కి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈయనకి పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. అందులో.. సూపర్ శరవణ స్టోర్స్, శరవణ స్టోర్స్ క్రౌన్ మాల్, శరవణ సెల్వరత్నంతోపాటు మరెన్నో బిజినెస్‌లు ఉన్నాయి. ఆ గ్రూప్ కంపెనీల్లో సుమారు 10 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే అరుళ్కి యువకుడిగా ఉన్నప్పటి నుంచి తెర మీద కనిపించాలనే కోరిక ఉండేది. అప్పటి నుంచి వ్యాపారంతో పాటే అరుల్ కోరిక కూడా పెరుగుతూనే వచ్చింది. ఈ మూవీ జులై 28న ప్రపంచవ్యాప్తంగా
అందుకే ఆయన స్టోర్స్ పబ్లిసిటీ యాడ్స్‌లో అరుళ్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. టీవీ ప్రకటనలతోపాటు ఆ హోర్టింగ్ల మీదా ఆయనే ఉంటారు. కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు. యాభై రెండేళ్ల వయస్సు వచ్చినా సినిమా లో హీరోగా కనిపించాలన్న కోరిక ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ప్రేక్షకులకి ఫర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనుకున్నారు. అందుకే ముందుగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి ట్రైనింగ్ సైతం తీసుకున్నారు.
అలాగే.. ఓ స్టార్ హీరో సినిమాకి పెట్టే బడ్జెట్‌తో సమానంగా.. అంటే దాదాపు రూ.60 కోట్ల భారీ ఖర్చుతో భారీ సినిమా తీశారు. అదే ‘ది లెజెండ్ (The Legend)’. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ( Urvashi Rautela), రాయ్ లక్ష్మి (Raai Laxmi) హీరోయిన్లుగా నటించారు. హారిష్ జయరాజ్ (Harris Jayaraj) సంగీతం అందించగా.. రాజు సుందరం డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అలాగే.. గతంలో భారీ సినిమాలు తీసిన దర్శక ద్వయం జెడి, జెర్రీ ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా దుబాయ్, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి పలు మెట్రో నగరాల్లో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో పూజా హెగ్డే, తమన్నా భాటియా, హన్సిక మోత్వానీ, రాయ్ లక్ష్మి, శ్రద్ధా శ్రీనాథ్, శ్రీలీల వంటి పలువురు సౌత్ ఇండియన్ నటీమణులు పాల్గొన్నారు.