జమ్మూ, కశ్మీర్ (Jammu Kashmir) ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను( Film Development Fund) ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికీ సంబంధించి సబ్సిడీల పంపిణీ కోసం సమాచార శాఖ కింద ఈ నిధులను కేటాయించింది.
జమ్మూ కశ్మీర్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకోసమే ఈ నిధులను కేటాయించింది. ఫిల్మ్ ఫాలసీ కింద ప్రభుత్వం గతేడాది రూ. 500 కోట్లను కేటాయించింది. రాబోయే ఐదేళ్ల పాటు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికీ ఈ నిధులను కేటాయిస్తున్నట్టు చెప్పింది. ఈ ఫాలసీ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. అర్హులైన ఫిల్మ్ మేకర్స్ అందరు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘‘2022-23 ఆర్థిక సంవత్సారానికీ సంబంధించి సమాచార శాఖ కింద ప్రత్యేకంగా ఫిల్మ్ డెవలప్ మెండ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సబ్సిడీల పంపిణీ కోసం బడ్జెట్‌లో రూ. 100కోట్ల నిధులను కేటాయిస్తున్నాం. అర్హులైన ఫిల్మ్ మేకర్స్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఫిల్మ్ ఫాలసీని అమలు చేయడానికీ, ఫిల్మ్ మేకర్స్‌కు సౌకర్యాలు కల్పించడం కోసం డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. షూటింగ్‌లకు సంబంధించిన కార్యకలాపాలను ఈ కమిటీ మానిటర్ చేస్తుందని తెలిపింది.