నా నటనకు పునాది పడింది ఆ సినిమాతోనే: విజయశాంతి

ABN , First Publish Date - 2021-08-04T17:40:12+05:30 IST

1983లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా 'నేటి భారతం'. టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఇందులో విజయశాంతి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించారు. నాగభూషణం, పి.ఎల్. నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నా నటనకు పునాది పడింది ఆ సినిమాతోనే: విజయశాంతి

1983లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా 'నేటి భారతం'. టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఇందులో విజయశాంతి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించారు. నాగభూషణం, పి.ఎల్. నారాయణ, రాజ్యలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కె. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా విజయశాంతి కెరీర్‌లో ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. 1985లో హిందీలో 'హక్వీక్వత్'గా, 1985లో తమిళంలో 'పుతియ తీర్పు'గా రిమేక్ చేయబడింది.




ఈ చిత్రం గురించి విజయశాంతి మాట్లాడుతూ.." నా నటనకు పునాది పడింది 'నేటి భారతం' సినిమాతోనే. ఈ సినిమా దర్శకులు టి. కృష్ణ గారి మైండ్ సెట్‌కి, ఆయన ఆలోచనకి విజయశాంతి కరెక్ట్‌గా సూటవుతుందనే ఆయన అభిప్రాయం. వేరే హీరోయిన్‌తో చేయాలని లేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళాను. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి నన్ను 'ఏలియన్స్' సినిమాకి తీసుకువెళ్ళారు. ఆయన ఆరోగ్యం అంత బాగోలేకపోయినా కూడా సినిమా చూపించి అమ్మా శాంతమ్మ ఆ అమ్మాయి చూశావా ఎలా ఫైట్స్ చేస్తుందో..ఒకరోజు నువ్వు కూడా చేయాలి అన్నారు. అలా 'నేటి భారతం' సినిమాకి అప్పుడే బీజం పడింది. ఆయన నాకు ఒక అన్నగా.. ఒక గురువుగా చాలా కేరింగ్‌గా ఉండేవారు. ఎందుకో తెలీదు ..ఈ క్యారెక్టర్ మా శాంతమ్మనే చేయగలుగుతుంది అని చాలా నమ్మకంగా చెప్పేవారు. 'ప్రతి ఘటన' సినిమాకి కూడా డేట్స్ కుదరకపోతే అసలు ఒప్పుకోలేదు. చాలామంది పేర్లు పరిశీలించినా.. చివరికి నాతోనే చేయించారు. 'దేశంలో దొంగలు పడ్డారు', 'రేపటి పౌరులు', 'దేవాలయం'..ఇవన్నీ మామూలు సినిమాలు కాదు. టి. కృష్ణ గారి సినిమాలంటే నటనకు స్కోప్ ఉంటాయి. జీవితంలో ఆయనని ఎప్పటికీ మర్చిపోను" అని అన్నారు. 

Updated Date - 2021-08-04T17:40:12+05:30 IST