హాలీవుడ్‌లో తొలి అడుగు

కథానాయిక సమంత కెరీర్‌లో మరో మైలురాయి ఇది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన సమంత, ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టేశారు. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే ఆంగ్ల  చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫిలిప్‌ జాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇది సరికొత్త ప్రపంచం. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు ఫిలిప్‌ జాన్‌కు థ్యాంక్యూ. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ట్వీట్‌ చేసింది సమంత. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.