చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదు

ABN , First Publish Date - 2021-12-09T08:58:12+05:30 IST

టికెట్‌ ధరలను తగ్గించడం వల్ల ప్రజలకు మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం భావించవచ్చు. కానీ నిర్మాతగా నా ఉత్పత్తికి నేను ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఉండాలి...

చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదు

టికెట్‌ ధరలను తగ్గించడం వల్ల ప్రజలకు మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం భావించవచ్చు. కానీ నిర్మాతగా నా ఉత్పత్తికి నేను ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఉండాలి. ధరలు భారీగా తగ్గించడం వల్ల చిత్ర పరిశ్రమ పురోగతి కుంటుపడుతుంది’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్‌. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో చిత్ర పరిశ్రమ సంతోషంగా లేదు. టికెట్‌ ధరలు ఇంతలా తగ్గించడం విచారకరం. మేం అంతా కలసి ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి రిక్వెస్ట్‌ చేస్తాం. ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందనుకుంటున్నాను’’ అన్నారు. సత్యదేవ్‌ హీరోగా గోపీ గణేష్‌ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘గాడ్సే’ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘గాడ్సే’ షూటింగ్‌ బుధవారంతో పూర్తయింది. జనవరి 26న విడుదల చేస్తున్నాం. రానా నటించిన పీరియాడికల్‌ చిత్రం ‘1945’ను ఈ నెలాఖరుకు రిలీజ్‌ చేస్తాం. బాలకృష్ణ అంగీకరిస్తే ఆయనతో ‘రామానుజాచార్య’ సినిమా తీయాలనుంది. దర్శకుడు గోపి గణేష్‌, హీరో సత్యదేవ్‌తో కొత్త సినిమాలు తీస్తున్నాం’’ అన్నారు. 


Updated Date - 2021-12-09T08:58:12+05:30 IST