శత్రువు కనిపించడు!
ABN , First Publish Date - 2021-08-08T06:08:46+05:30 IST
‘‘కంటికి కనిపించని కాలయముడు, ఊహించని కపటనేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు. కాలసర్పంలా దూసుకొస్తున్న సమస్యల నుంచి బయటకు రావడానికి దారి కోసం వెతుకుతున్నా...

‘‘కంటికి కనిపించని కాలయముడు, ఊహించని కపటనేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు. కాలసర్పంలా దూసుకొస్తున్న సమస్యల నుంచి బయటకు రావడానికి దారి కోసం వెతుకుతున్నా. విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు. మరి, నేను వెతుకుతున్న నా ప్రశ్నలకు సమాధానం ఎవరు?’’ అని ఆది సాయికుమార్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్’. జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళీ దివాకర్ నిర్మిస్తున్నారు. శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. అతి త్వరలో పాటల్ని, భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక-నిర్మాతలు తెలిపారు. దర్శనా బానిక్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో ఆమని, కౌశల్ మందా, ‘సత్యం’ రాజేశ్, ‘తాగుబోతు’ రమేశ్, ఆనంద్ చక్రపాణి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బలి సంగీత దర్శకుడు.