Stranger Things మ్యూజిక్‌కు ఇండియన్ ట్విస్ట్ ఇచ్చిన Ilaiyaraaja

ABN , First Publish Date - 2022-05-26T01:11:25+05:30 IST

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) రూపొందించిన వెబ్‌సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things). సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ షో ఘన విజయాన్ని సాధించింది. ఎక్కువ మంది చూసిన వెబ్‌సిరీస్‌గా

Stranger Things మ్యూజిక్‌కు ఇండియన్ ట్విస్ట్ ఇచ్చిన Ilaiyaraaja

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) రూపొందించిన వెబ్‌సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things). సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ షో ఘన విజయాన్ని సాధించింది. ఎక్కువ మంది చూసిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఈ షోను 1980దశాబ్దం నేపథ్యంలో తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. హాకిన్స్ అనే పట్టణంలో ఓ బాలుడు కనిపించకుండా పోతాడు. అదే సమయంలో ఓ బాలిక ఆ పట్టణానికీ వస్తుంది. ఆ బాలుడిని కనిపెట్టడం కోసం అతడి తల్లి, స్నేహితులు చేసిన ప్రయత్నాలను ఈ వెబ్‌సిరీస్‌లో చూడవచ్చు. అతీంద్రియ శక్తులు, రాక్షస జీవులతో వారు చేసే పోరాటలను సైతం ఈ వెబ్‌సిరీస్‌లో వీక్షించవచ్చు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సీజన్స్ వచ్చి భారీ విజయాన్ని సాధించాయి. ‘స్ట్రేంజర్ థింగ్స్’ నాలుగో సీజన్ మే 27నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో భారతీయ ప్రేక్షకులను ఓటీటీ ప్లాట్‌ఫాం సర్‌ప్రైజ్ చేసింది.


‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ మ్యూజిక్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ మ్యూజిక్ 1980వ దశకంలోకి మనల్ని తీసుకువెళుతుంది. ఈ వెబ్‌సిరీస్ నాలుగో సీజన్ వీక్షకులకు అందుబాటులోకి రాబోతుండటంతో మ్యూజిక్ కంపోజర్ ఇళయ రాజా(Ilaiyaraaja)తో కలసి నెట్‌ఫ్లిక్స్ భారతీయులను సర్‌ప్రైజ్ చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో సొంత శైలిలో ఈ థీమ్ మ్యూజిక్‌ని మన ముందుకు తీసుకు వచ్చారు. ఈ మ్యూజిక్ వీడియోను నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘మ్యాస్ట్రో ఇళయరాజా వెర్షన్‌ ‘ద స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ మ్యూజిక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగు, తమిళ్‌లో ఈ షో త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది’’ అని ఓటీటీ ప్లాట్‌ఫాం పేర్కొంది. ద డఫర్ బ్రదర్స్ (The Duffer Brothers) ‘స్ట్రేంజర్ థింగ్స్’ను క్రియేట్ చేశారు.



Updated Date - 2022-05-26T01:11:25+05:30 IST