వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా కరోనా వచ్చింది!

ABN , First Publish Date - 2021-09-02T05:33:15+05:30 IST

హిందీ నృత్యదర్శకురాలు, దర్శకురాలు ఫరా ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు...

వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా కరోనా వచ్చింది!

హిందీ నృత్యదర్శకురాలు, దర్శకురాలు ఫరా ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘‘వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాను. ఎక్కువశాతం రెండుసార్లు కరోనా టీకా వేయించుకున్న వ్యక్తులతోనే కలిసి పనిచేశా. అయినా సరే... కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఎందుకిలా జరిగిందో ఆశ్చర్యంగా ఉంది. నన్ను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోమని చెప్పా. ఒకవేళ వయసు ప్రభావం, మతిమరుపు వల్ల ఎవరికైనా చెప్పడం మర్చిపోతే... దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి. త్వరలో కొవిడ్‌ నుంచి కోలుకుంటానని ఆశిస్తున్నా’’ అని ఫరా ఖాన్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-09-02T05:33:15+05:30 IST