తెరవెనుక నిజాలు చూపించాం

ABN , First Publish Date - 2021-12-09T08:57:27+05:30 IST

‘‘నయీం జీవిత కథతో రామ్‌గోపాల్‌ వర్మ ఓ సినిమా చేయాలనుకున్నారు. కథ రాసే బాధ్యత నాకు అప్పజెప్పారు. వర్మ ఆ సినిమా చేయకపోవడంతో కథ బాగా నచ్చి నేనే ‘నయీం డైరీస్‌’ చిత్రం తెరకెక్కించాను...

తెరవెనుక నిజాలు చూపించాం

‘‘నయీం జీవిత కథతో రామ్‌గోపాల్‌ వర్మ ఓ సినిమా చేయాలనుకున్నారు. కథ రాసే బాధ్యత నాకు అప్పజెప్పారు. వర్మ ఆ సినిమా చేయకపోవడంతో కథ బాగా నచ్చి నేనే ‘నయీం డైరీస్‌’ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు దాము బాలాజీ. సీఏ వరదరాజు నిర్మాణంలో వశిష్ట సింహ హీరోగా దాము బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘నయీం డైరీస్‌’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వ శిష్ట సింహ నయీం పాత్రలో ఒదిగిపోయాడు. పోలీస్‌, రాజకీయ, వ్యవస్థలు చే సిన తప్పుల వల్ల నయీం రాక్షసుడిలా మారాడు. వీటికి తోడు స్వీయ తప్పిదాలతో ఆయన దుర్మార్గుడిగా మారాడు. నయీం ఎన్‌కౌంటర్‌లో ప్రజలకు తెలియని తెరవెనుక నిజాలను ఈ సినిమాలో చూపించాం. దీని తర్వాత మరికొన్ని నక్సలైట్‌ కథలు తెరకెక్కించాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. 


Updated Date - 2021-12-09T08:57:27+05:30 IST