ఓటీటీలలో ఉండే అందం అదే!
ABN , First Publish Date - 2021-11-19T10:08:45+05:30 IST
వెంకటేష్ నటించిన ‘నారప్ప’ ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలోనే వస్తోంది. ఈనెల 25న ‘దృశ్యం 2’ అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో...

వెంకటేష్ నటించిన ‘నారప్ప’ ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలోనే వస్తోంది. ఈనెల 25న ‘దృశ్యం 2’ అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో వెంకటేష్ విలేకరులతో మాట్లాడారు. ‘‘రాంబాబు లాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. అసలు వాడు ఇలాకూడా ఆలోచిస్తాడా? అనిపించేలా ఆ పాత్రని తీర్చిదిద్దారు. సీటు అంచున కూర్చుని చూసేలా.. ఈ సినిమాని రూపొందించారు. మలయాళంతో పోలిస్తే మార్పులు ఎక్కువ చేయలేదు. ‘దృశ్యం 1’ చూడకపోయినా ఈ కథ అర్థం అవుతుంది. ఓటీటీల్లో ఉన్న అందం ఏమిటంటే... ఆ సినిమాని యేడాది పొడవునా చూస్తూనే ఉంటారు. వచ్చిన తొలి రోజే చూసేయాలని ఏం లేదు. కుటుంబం అంతా కూర్చుని, హాయిగా చూడగలిగే సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం బాగుంటుంద’’న్నారు.