అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో ‘ఆహా’ న‌యా వెబ్‌ సిరీస్

అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ‘ఆహా’ ఇప్పుడొక నయా వెబ్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ‘ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ’ టైటిల్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభ‌న్‌, టినా శిల్ప‌రాజ్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 8 నుంచి ప్రీమియ‌ర్ కానున్నట్లుగా అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించారు. తాజాగా ‘ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ’ ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ని ఆహా వ్య‌వ‌స్థాప‌కులు, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, ‘ఆహా’ సీఈఓ అజిత్ ఠాకూర్.. నిర్మాత‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ సీఈఓ సుప్రియా యార్ల‌గ‌డ్డ క‌లిసి ఆవిష్క‌రించారు. రొమాంటిక్ డ్రామాగా రానున్న ఈ వెబ్ సిరీస్‌లో  మిడిల్ క్లాస్ యువ‌కుడు విజ‌య్‌. అత‌ని త‌ల్లిదండ్రులు చిన్న బేక‌రీ నిర్వ‌హిస్తుంటారు. అత‌నికి ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌పంచం అంతా ఆమె పాదాల ముందు ఉన్నా, ఆమె మాన‌సికంగా ఒంట‌రిగా ఫీల‌వుతుంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన రొమాన్సే ఈ వెబ్‌ సీరీస్‌. జొనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విష్ణు ప్రియ‌, సాయి శ్వేత‌, సంగీత్ శోభ‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఝాన్సీ ల‌క్ష్మి, వెంక‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 


ఈ సందర్భంగా.. ‘‘ఇద్దరు భిన్న మనస్కుల మధ్య జరిగే ప్రేమ, ఎమోషన్ వంటి అంశాలతో ఈ స్టోరీ రన్ అవుతుంది. లీడ్ ఆర్టిస్టుల మ‌ధ్య కెమిస్ట్రీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. మ‌రీ ముఖ్యంగా వాళ్ల జీవ‌న ప్ర‌యాణం, వాళ్ల డెస్టినీస్ అంద‌రినీ అల‌రిస్తాయి. ప‌ది భాగాలుగా సాగే షో ఇది. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంలో పలు శాఖల్లో అగ్రగామిగా ఉన్న అన్నపూర్ణలాంటి ఘన చరిత్ర కలిగిన ప్రొడక్షన్‌ హౌస్‌తో చేతులు కలపడం మంచి పరిణామం. సంతోష్‌ శోభన్‌, టీనా శిల్పరాజ్‌, విష్ణుప్రియ నటనను చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. వారికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది..’’ అని ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్‌ అన్నారు. ‘‘అచ్చమైన తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్‌ కావడం లేదనే విషయం అర్థమైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి సంస్థతో కలిసి పలు ప్రాజెక్టులకు పనిచేసి, గుర్తుండిపోయే షోస్‌ని అందించాలని అనుకుంటున్నాం’’ అని కెషత్‌ ఇంటర్నేషనల్‌కి చెందిన కెల్లీ రైట్‌ అన్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.