సీనియర్ల సలహాలు తీసుకోలేదు

ABN , First Publish Date - 2021-10-08T08:34:58+05:30 IST

‘దర్శకుడు క్రిష్‌ ఫోన్‌ చేసి కలవమంటే వెళ్లాను. కానీ ‘కొండపొలం’ సినిమాకోసం అనుకోలేదు. ఆయనలాంటి గొప్ప దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు’ అని హీరో వైష్ణవ్‌తేజ్‌ అన్నారు...

సీనియర్ల సలహాలు తీసుకోలేదు

‘దర్శకుడు క్రిష్‌ ఫోన్‌ చేసి కలవమంటే వెళ్లాను. కానీ ‘కొండపొలం’ సినిమాకోసం అనుకోలేదు. ఆయనలాంటి గొప్ప దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు’ అని హీరో వైష్ణవ్‌తేజ్‌ అన్నారు. ఆయన హీరోగా దర్శకుడు క్రిష్‌ రూపొందించిన చిత్రం ‘కొండపొలం’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘కొండపొలం అనేది పూర్తిగా కొత్త తరహా కథాంశం. ఎక్కువ భాగం అటవీ నేపథ్యంలో సాగే చిత్రమే అయినా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. షూటింగ్‌లో సాయిచంద్‌, కోట శ్రీనివాసరావు, రకుల్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు మొహమాటం ఎక్కువ. అందుకే ఎలా నటించాలనే విషయంలో వారి సలహాలు తీసుకోలేదు. నటించేటప్పుడు ఎలా చేస్తే పాత్రలో భావోద్వేగాలు పండుతాయో ఆలోచించుకొని అలా చేస్తాను. గొర్రెలు కాసే యువకుడి పాత్ర మొదట్లో కొత్తగా అనిపించినా క్రమంగా పాత్రలో లీనమై నటించాను. సంభాషణలు ప్రత్యేక యాసలో చెప్పాల్సి రావడంతో రోజు ప్రాక్టీస్‌ చేశాను’’ అన్నారు. 


Updated Date - 2021-10-08T08:34:58+05:30 IST