బాలీవుడ్‌ను వదిలి రోడ్డు పక్కన దాబాలో పనిచేయడానికి కారణం ఏంటని అడిగితే.. ఆ నటుడు చెప్పిన సమాధానం ఇది

ABN , First Publish Date - 2021-10-31T00:25:15+05:30 IST

దిల్ సే, ఖిలాడీ -786, వెల్ కమ్, ఢమాల్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటుడు సతీశ్ మిశ్రా. కొన్ని ఏళ్ల క్రితం ఆయన బాలీవుడ్‌ను విడిచిపెట్టి, రోడ్డు పక్కన దాబాలో పనిచేయడానికి వెళ్లారు.

బాలీవుడ్‌ను వదిలి రోడ్డు పక్కన దాబాలో పనిచేయడానికి కారణం ఏంటని అడిగితే.. ఆ నటుడు చెప్పిన సమాధానం ఇది

దిల్ సే, ఖిలాడీ -786, వెల్ కమ్, ఢమాల్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటుడు సతీశ్ మిశ్రా. కొన్ని ఏళ్ల క్రితం ఆయన బాలీవుడ్‌ను విడిచిపెట్టి, రోడ్డు పక్కన దాబాలో పనిచేయడానికి వెళ్లారు. అందుకు కారణం ఏంటని అడిగితే ఒక ఇంటర్వ్యూలో ఆయన సమాధానం చెప్పారు. బాలీవుడ్‌ను విడిచిపెట్టినప్పుడు ఆయన కెరీర్ అద్భుతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టారు. గంగోత్రిలో రోడ్డు పక్కన రోడ్డు పక్కన దాబాలో పనిచేస్తూ మ్యాగీ, ఆమ్లెట్లు అమ్మారు. 


ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘ కొన్ని ఏళ్ల క్రితం నేను చావును చాలా దగ్గరి నుంచి చూశాను. ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. సినిమాలకు తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని అనుకున్నాను. రోడ్డు పక్కన దాబాలో పనిచేయడం మొదలెట్టాను. అయినప్పటికీ  ప్రజలు నన్ను గుర్తు పట్టడం మొదలెట్టారు. అప్పుడు నా కడుపుకు ఇన్ఫెక్షన్ సోకింది. నా ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగాలేదు.  నేను కూడా మరణం అంచులకు చేరుకున్నాను. నా తండ్రితో కొన్ని రోజులు గడపాలనుకున్నాను. అకస్మాత్తుగా ఆయన కూడా మరణించారు. ఆయన మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. జీవితం ఒడుదొడుకులతో కూడినదని నాకు అర్థమయింది. దేవుడు సృష్టిని ఆస్వాదిస్తూ నా సమయాన్ని ఎందుకు గడపకూడదనుకున్నాను. కొండలు, పర్వతాలన్నింటిని చూడాలనుకున్నాను ’’ అని ఆయన చెప్పారు.


రోహిత్ శెట్టి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నానని చెప్పారు. ఆల్ ది బెస్ట్ చిత్రంలో ఒక పాత్ర‌కు తనను ఎంపిక చేశారన్నారు. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆయన ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, జానీ లీవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Updated Date - 2021-10-31T00:25:15+05:30 IST