ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం: నాగ చైతన్య

ABN , First Publish Date - 2022-01-23T13:55:47+05:30 IST

సినిమాల తర్వాత ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం అని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అన్నారు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'బంగార్రాజు' సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం: నాగ చైతన్య

సినిమాల తర్వాత ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం అని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అన్నారు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'బంగార్రాజు' సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చైతూ సక్సెస్ మీట్‌లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు కొత్త కారు కొన్నా కూడా మళ్ళీ దాన్ని రీ మోడలింగ్ చేయిస్తారట కదా..! అని అడిగారు. దానికి చైతూ.. "ఒకసారి నా బర్త్ డేకి నాన్న ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కారును నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. జపాన్ నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించి నాకు కావలసినట్టుగా చేయించుకున్నాను. కార్లు - బైకులు.. ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం. సినిమాల తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది వాటినే. నాకు ఏ మాత్రం తీరిక దొరికినా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకులు, కార్ల గురించి స్టడీ చేస్తుంటాను" అని చెప్పుకొచ్చారు. కాగా, నాగ చైతన్య నటించిన 'థాంక్యూ', బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ చేసిన 'లాల్ సింగ్ చద్దా' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.



Updated Date - 2022-01-23T13:55:47+05:30 IST