నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం అదే: రాధిక శరత్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-04-04T00:26:50+05:30 IST

నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం అదే అని సీనియర్ నటీమణి రాధిక శరత్‌కుమార్‌ తాజాగా పాల్గొన్న "ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే" కార్యక్రమంలో తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే

నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం అదే: రాధిక శరత్‌కుమార్‌

నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం అదే అని సీనియర్ నటీమణి రాధిక శరత్‌కుమార్‌ తాజాగా పాల్గొన్న "ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే" కార్యక్రమంలో తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ నాయకులు పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను షోలో చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా..ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో ఉన్న అనుభవం గురించి మాట్లాడిన ఆమె.."పెద్ద ఎన్టీఆర్‌తో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ సినిమా చేశాను. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు గారిని చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాను. పాట చిత్రీకరణ జరిగేటప్పుడు డ్యాన్స్‌ మూమెంట్స్‌ కంఫర్ట్‌గా ఉండాలని నాగేశ్వరరావు గారు.. టీ, జ్యూస్‌ మాత్రమే తాగేవారు. ఎన్టీఆర్‌ ఆరు గంటలకు షూటింగ్‌ అంటే ఒక పావుగంట ముందే మేకప్‌తో రెడీ అయి కూర్చునేవారు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసేవారు. అంతేతప్ప మార్పులు చెప్పేవారు కాదు. ఈ తరం వాళ్లు అలా వద్దనుకుంటున్నారు"..అని అన్నారు. 


ఇక చిరంజీవి గురించి.."ఆయన సెల్ఫ్‌మేడ్‌ మాన్‌. తన కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో వర్క్‌ చేస్తున్నారు.  ఆయనకు తల్లిగా అయితే చేయను. విలన్‌గా అయినా చేస్తాను. నేను నటిని ఎలాంటి పాత్రలయినా చేస్తాను".. అని అన్నారు. అలాగే, తెలుగు హీరోలందరూ చాలా ఇష్టం. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఫెంటాస్టిక్‌ ఎనర్జీ. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 


అంతేకాదు, జీవితం నేర్పిన పాఠం గురించి రాధిక మాట్లాడుతూ..కొవిడ్‌తో నాకు తెలిసినవాళ్లు చాలా మంది చనిపోయారు. అప్పుడే నన్ను బాధపెట్టే సంఘటలను పూర్తిగా మర్చిపోవాలని అనుకున్నాను. సంతోషం కలిగించే విషయాలే గుర్తుంచుకున్నాను. ఏం జరిగినా సంతోషంగా ఉండాలనేది నేను జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం"..అని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-04-04T00:26:50+05:30 IST