ThankYou: క్లాసీ లుక్‌లో చైతూ.. పిక్ వైరల్

ABN , First Publish Date - 2022-05-25T01:25:01+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ (ThankYou). ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయబోతోంది.

ThankYou: క్లాసీ లుక్‌లో చైతూ.. పిక్ వైరల్

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ (ThankYou). ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయబోతోంది. లవ్ స్టోరి (Love Story), బంగార్రాజు (Bangaarraju) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా థాంక్యూ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా (Rashi Khanna) నాగ చైతన్యకు జంటగా నటించింది. 


ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. దీనిలో భాగంగా మే 25 సాయంత్రం 5:04 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించారు. దీనిలో హీరో నాగ చైతన్య చాలా క్లాసీగా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్‌తో అంచనాలు బాగానే పెరిగిన థాంక్యూ మూవీ నుంచి రాబోయో టీజర్ ఏమేరకు ఆ అంచనాలను రెట్టింపు చేస్తుందో చూడాలి.


ఇక ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 8, 2022 వతేదీన భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా, నాగ చైతన్య నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న వెబ్ సిరీస్‌తో పాటు తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా, పరశురాం దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు నాగ చైతన్య. 



Updated Date - 2022-05-25T01:25:01+05:30 IST