Thankyou : ఓటీటీలోకి వచ్చేస్తోంది !

Twitter IconWatsapp IconFacebook Icon
Thankyou : ఓటీటీలోకి వచ్చేస్తోంది !

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya), రాశీఖన్నా (Rashi Khanna), మాళవికా నాయర్ (Malavika Nayar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ’ (Thankyou).  విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. నాగచైతన్య మూడు వేరియేషన్స్ కలిగిన పాత్రల్లో మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చినప్పటికీ చిత్రం అంతగా జనానికి రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలై నెలరోజులు కాకుండానే.. ఓటీటీలోకి రానుండడం గమనార్హం. 

‘థాంక్యూ’ చిత్రాన్ని ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. ఇండియాతో పాటు మొత్తం 240 దేశాల్లో దీన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నేడు (మంగళవారం) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్న ఓ యువకుడు.. తన వల్లే తాను ఎదిగాననే గర్వంతో బతుకుతుంటాడు. అయితే ఒక సంఘటనతో కళ్ళు తెరుచుకొని.. తన జీవితంలో తన ఉన్నతికి కారణమైన వారికి థాంక్స్ చెప్పడానికి బైలు దేరతాడు. చివరికి అతడు తను అనుకున్నది సాధించగలిగాడా? లేదా అన్నది మిగతా కథ. 

అవికాగోర్, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, రాజశ్రీనాయర్, తులసి, ఈశ్వరీరావు, మిర్చీ హేమంత్, భరత్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ (Thaman) సంగీతం అందించగా.. పీసీ శ్రీరామ్ (PC Sriram) ఛాయాగ్రహణం నిర్వహించారు. మరి థియేటర్స్‌లో అంతగా మెప్పించలేకపోయిన ఈ  సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.