మహేశ్ కోసం తమన్ మొదలుపెట్టారు
ABN , First Publish Date - 2022-01-17T19:28:09+05:30 IST
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాకు సర్వం సిద్ధమవుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్28వ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ‘సర్కారువారి పాట’ చిత్రానికి సంగీత కార్యక్రమాలు పూర్తి చేసిన తమన్ సంక్రాంతి సందర్భంగా మహేశ్ 28న చిత్రానికి మ్యూజిక్ పనులు మొదలుపెట్టారు.

మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాకు సర్వం సిద్ధమవుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్28వ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ‘సర్కారువారి పాట’ చిత్రానికి సంగీత కార్యక్రమాలు పూర్తి చేసిన తమన్ సంక్రాంతి సందర్భంగా మహేశ్ 28న చిత్రానికి మ్యూజిక్ పనులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. త్రివిక్రమ్‌తో తమన్ చేస్తున్న మూడో చిత్రమిది. తాజాగా త్రివిక్రమ్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి ‘‘సంక్రాంతి సందర్భంగా త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాం. మా మ్యూజికల్ జర్నీ ఇలా కొనసాగుతూనే ఉండాలి’’ అని తమన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మార్చిలో ఈ చిత్రం సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉంది. ఇందులో మహేశ్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.