ప‌వ‌న్, రానా కోసం త‌మ‌న్ ఫోక్ సాంగ్‌

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ సినిమాకు ఇది రీమేక్‌. సాగ‌ర్ కె.చంద్ర తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ రూపొందిస్తుండ‌గా త్రివిక్ర‌మ్ మాట‌లు రాస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఓ ఫోక్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నార‌ట‌. ఈ సాంగ్ సినిమా సెకండాఫ్‌లో రానుంద‌ట‌. ఈ పాట‌ను పెంచ‌ల‌దాస్ ఆల‌ప‌రిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.