Tollywood : ‘తల్లుమాల’.. చూసుకోరా? ఎనకమాల?

ABN , First Publish Date - 2022-09-13T15:19:26+05:30 IST

మలయాళ సినిమాల్ని . భాష రాకపోయినా.. చూసి ఎంజాయ్ చేయడం బాగా అలవాటు చేసుకున్నారు మనవాళ్లు. లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఓటీటీలపై పడ్డ జనం మాలీవుడ్‌లో విడుదలైన ప్రతీ సినిమాకూ తెగ కనెక్ట్ అయిపోయారు.

Tollywood : ‘తల్లుమాల’.. చూసుకోరా? ఎనకమాల?

మలయాళ సినిమాల్ని భాష రాకపోయినా.. చూసి ఎంజాయ్ చేయడం బాగా అలవాటు చేసుకున్నారు మనవాళ్లు. లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఓటీటీలపై పడ్డ జనం మాలీవుడ్‌లో విడుదలైన ప్రతీ సినిమాకూ తెగ కనెక్ట్ అయిపోయారు. చక్కగా సబ్ టైటిల్స్‌తో ఆ సినిమాల్ని చూసేసి.. సోషల్ మీడియాలో వాటిపై రివ్యూలు కూడా ఇచ్చేశారు. ఆ ప్రోసెస్ ఇంకా కంటిన్యూ అవుతునే ఉంది. చిరంజీవి (Chiranjeevi) లాంటి హీరోనే ‘లూసిఫర్’(Lucifer) లాంటి యాక్షన్ మూవీని రీమేక్ చేస్తున్నారంటే మల్లూ సినిమాపై మనోళ్ళకి ఏ స్థాయిలో మక్కువ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పలు మలయాళ సూపర్ హిట్ మూవీస్ టాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే తాజాగా అతి తక్కువ బడ్జెట్ తో మాలీవుడ్ లో విడుదలై.. అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం ‘తల్లుమాల’ (Thallumala) (Chain of Fights). టోవినో థామస్ (Tovino Thomas) హీరోగా నటించిన ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కైవసం చేసుకుంది. హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ను ఫిక్స్ చేశారు. 


అంతాగా బాగానే ఉంది. కాకపోతే.. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాకా అసలు సమస్య ప్రారంభమైంది. తెలుగులో రీమేక్ అవుతోందని తెలియగానే.. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఎలాగూ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి.. ఈ సినిమా కథాంశం ఈజీగా జనానికి కనెక్ట్ అయిపోతుంది. దీనికి అదే అసలు సమస్య అనుకుంటే పొరపాటే. నెట్‌ఫ్లిక్స్‌లో ‘తల్లుమాల’ తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అదే నిర్మాతలకు సమస్యగా మారింది. త్వరలోనే సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళాలనుకున్న మేకర్స్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఆల్రెడీ సినిమాను చాలా మంది చూసేసే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు అనే భయం పట్టుకుందట నిర్మాతలకు. 


ఇంతకు ముందు ‘లూసిఫర్’ చిత్రం కూడా ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఆడియోతో కూడా విడుదలైంది. థియేటర్స్‌లో కూడా కొన్ని చోట్ల విడుదలైంది. అప్పుడా సినిమాను ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి.. ‘గాడ్‌ఫాదర్’ మేకర్స్ సేఫ్ అయ్యారు. అలాగే.. తమిళ సూపర్ హిట్ ‘మానాడు’ (Maanaadu) విషయంలోనూ ఇదే జరిగింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో.. తెలుగు వెర్షన్ కూడా విడుదలైపోయింది. ఆ తర్వాత సినిమా రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions) వారు తీసుకున్నారు. ఇప్పుడు ‘తల్లుమాల’ చిత్రం విషయంలోనూ అదే జరుగుతోంది. రీమేక్ రైట్స్ తీసుకున్నప్పుడే.. నిర్మాతలు ఇలా జరక్కుండా జాగ్రత్త పడి ఉండాల్సింది. అగ్రిమెంట్ టైమ్ లోనైనా కాస్త వెనకా ముందు చూసుకొని రైట్స్ కొనుక్కోవల్సిందని కామెంట్స్ వస్తున్నాయి. మరి ‘తల్లుమాల’ తెలుగులో రీమేక్ అవుతుందో లేదో చూడాలి.   

Updated Date - 2022-09-13T15:19:26+05:30 IST