Thalapathy 66: ఫస్ట్ లుక్, టైటిల్ వచ్చేది ఆరోజేనా..?

ABN , First Publish Date - 2022-06-15T14:20:59+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ (Talapathy Vijay) హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Thalapathy 66: ఫస్ట్ లుక్, టైటిల్ వచ్చేది ఆరోజేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ (Talapathy Vijay) హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ మొదటిసారి తెలుగులో నటిస్తున్న ఈ స్ట్రైట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


అయితే, అభిమానులు ఈ సినిమా నుంచి విజయ్ బర్త్ డే ట్రీట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కొత్త మూవీ నుంచి ఫస్ట్ లుక్ అలాగే, టైటిల్ కూడా రివీల్ చేస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వార్తలు కూడా దీనికి సబందించే. ఈ నెలలోనే విజయ్ బర్త్ డే ఉంది. ప్రతీ ఏడాది తన బర్త్ డేకి విజయ్ కొత్త మూవీకి సంబధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.


అలాగే, ఈ సారి తన 66వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, అలాగే సినిమా టైటిల్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే, టైటిల్ కూడా లాక్ చేశారని సమాచారం. జూన్ 22న విజయ్ బర్త్ డే కానుకగా ఈ అప్‌డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'బీస్ట్' సినిమాతో విజయ్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-15T14:20:59+05:30 IST