Thalapathy 66: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్..?

ABN , First Publish Date - 2022-05-25T15:25:23+05:30 IST

కోలీవుడ్ స్టార్ థలపతి (Thalapathy) విజయ్ (Vijay) హీరోగా తెలుగు, తమిళ భాషలలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇది విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.

Thalapathy 66: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్..?

కోలీవుడ్ స్టార్ థలపతి (Thalapathy) విజయ్ (Vijay) హీరోగా తెలుగు, తమిళ భాషలలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇది విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ఈ హీరో ఇటీవలే బీస్ట్ (Beast) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. అయితే, తెలుగులో మాత్రం ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తన 66వ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో చేస్తున్నారు విజయ్. 


రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెద్దగా హడావుడి లేకుండా చిత్రీకరణ జరుగుతున్న థలపతి 66 మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి హీరో విజయ్ ఫస్ట్ లుక్‌తో పాటుగా టైటిల్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందట.


జూన్ 21న ఈ సినిమా ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. జూన్ 21న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగానే అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారికంగా కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ తెలుగు స్ట్రైట్ సినిమా ఇక్కడ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 

Updated Date - 2022-05-25T15:25:23+05:30 IST