‘వారసుడు’ గా Thalapathi Vijay ?

ABN , First Publish Date - 2022-06-18T01:14:21+05:30 IST

దళపతి విజయ్ (Vijay) గత చిత్రం ‘బీస్ట్’ (Beast) తమిళ నాట రికార్డు వసూళ్ళను రాబట్టింది. తెలుగులో ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.

‘వారసుడు’ గా Thalapathi Vijay ?

దళపతి విజయ్ (Vijay) గత చిత్రం ‘బీస్ట్’ (Beast) తమిళ నాట రికార్డు వసూళ్ళను రాబట్టింది. తెలుగులో  పర్వాలేదనిపించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileepkumar) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. తదుపరిగా విజయ్ తన కెరీర్‌లో 66వ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మాణం జరుపుకోనుంది. వంశీ పైడిపల్లి (Vamshy Paidipalli) దర్శకత్వంలో, దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం అధికారికంగా చిత్రాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి తమిళంలో ‘వారిసు’ (Vaarisu), తెలుగులో ‘వారసుడు’ (Varasudu) టైటిల్స్‌ను రిజిస్టర్ చేసినట్టు టాక్. 


ఇదే పేరుతో 1993లో నాగార్జున (Nagarjuna) హీరోగా ఇవివి (Evv) ఒక సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటించగా.. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొన్నామధ్య చిరంజీవి (Chiranjeevi) ‘మాస్టర్’ (Master) టైటిల్ తో హిట్ కొట్టిన విజయ్.. ఈసారి నాగ్ టైటిల్‌తో రానుండడం ఆసక్తిగా మారింది. రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తుండగా.. శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాశ్ రాజ్, జయసుధ, యోగిబాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక పాత ‘వారసుడు’ చిత్రంలో విలన్ గా నటించిన శ్రీకాంత్ (Srikanth) ఈ వారసుడు చిత్రంలోనూ నటించబోతుండడం విశేషం.


వంశీ పైడిపల్లి గత చిత్రం మహేశ్‌బాబు (Maheshbabu) ‘మహర్షి’ (Maharshi) సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యాక్షన్ పరంగానూ అభిమానుల్ని ఆకట్టుకోనుంది. 2023 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించి, విడుదలను కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారు. మరి ‘వారసుడు’ గా దళపతి విజయ్ టాలీవుడ్, కోలీవుడ్ లో ఏ స్థాయిలో అలరించబోతాడో చూడాలి. 

Updated Date - 2022-06-18T01:14:21+05:30 IST