పాన్ ఇండియా నటుడిగా ‘తేన్’ ఫేమ్ తరుణ్ కుమార్
ABN , First Publish Date - 2021-09-20T17:25:52+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి ప్రాంభమైన తొలినాళ్ళలోనే గణేష్ వినాయకన్ దర్శకత్వం వహించి రిలీజైన చిత్రం ‘తేన్’. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి ప్రాంభమైన తొలినాళ్ళలోనే గణేష్ వినాయకన్ దర్శకత్వం వహించి రిలీజైన చిత్రం ‘తేన్’. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినీప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోగా తరుణ్‌కుమార్ నటించారు. వేలు అనే పాత్రలో ఈయన జీవించారు. తరుణ్ కుమార్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శకనిర్మాతలు ఎంతో హ్యాపీగా ఫిలయ్యారు.
అదేసమయంలో తరుణ్‌కుమార్ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్ చేశారు. అదేసమయంలో ఇతర నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు వెబ్‌సిరీస్ అవకాశాలు కూడా తరుణ్ కుమార్ తలుపుతడుతున్నాయి. అంతేకాకుండా, హీరో అరుణ్ విజయ్ సినిమాలో ఓ నెగెటివ్ పాత్రలో నటించారు. అలాగే, ఓ వెబ్ సిరీ్‌సలో కూడా నటించేందుకు సమ్మతించారు. ముఖ్యంగా ఒక తమిళంకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడుగా మారాలన్న ఆశయంతో తరుణ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు.
