TFCC: వ్యక్తిగత ప్రసంగాలతో ఛాంబర్‌కు సంబంధం లేదు

ABN , First Publish Date - 2021-09-27T01:46:25+05:30 IST

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్లాల్ర్లో చర్చనీయాంశమైంది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోంది అంటూ చేసిన ప్రసంగంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

TFCC: వ్యక్తిగత ప్రసంగాలతో ఛాంబర్‌కు సంబంధం లేదు

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్లాల్ర్లో చర్చనీయాంశమైంది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోంది అంటూ చేసిన ప్రసంగంపై విమర్శలు ఎదురవుతున్నాయి.  ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. చిత్ర పరిశ్రమ సాఫీగా ముందుకు సాగాలంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారం అవసరం అని పేర్కొంది. వ్యక్తిగతంగా వేదికపై చేసిన వ్యాఖ్యలకు తమకూ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. 


‘‘కరోనా కారణంగా సినిమా పరిశ్రమ సమస్యల్లో ఇరుక్కుంది.  ప్రభుత్వాల అండ లేకుండా సినిమా మనుగడ కష్టం. సినిమా రంగంపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై ప్రసంగిస్తున్నారు. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమను నమ్ముకుని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్నినానితో చర్చలు జరిపాం. ముఖ్యమంత్రి జగన్‌ సినీ రంగ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-27T01:46:25+05:30 IST