ఆ మూడు చిత్రాల కోవలో ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’!

ABN , First Publish Date - 2022-01-26T22:50:49+05:30 IST

అవికా గోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో ఎస్‌ఆర్‌ మేకర్స్‌, అన్విత అవని క్రియేషన్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం నిర్మాతలు. అజయ్‌ మైసూర్‌ సమర్పకులు. సినిమాటోగ్రాఫర్‌ ‘గరుడవేగ’ అంజి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో సి. కల్యాణ్‌, ఛోటా.కె. నాయుడు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్‌ రవి ఆవిష్కరించారు. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకిరానుంది.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఒక్కడితో ఎప్పుడూ సక్సెస్‌ రాదని మా గురువు దాసరి నారాయణరావుగారు చెబుతుండేవారు. నిర్మాత అచ్యుత రామారావు తమకు ఇంకో ముగ్గురు తోడయ్యారని చెబితే సంతోషం అనిపించింది. అవికా గోర్‌కు సరైన సక్సెస్‌ రాలేదు. ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్‌ వరిస్తుంది. పనిలో అంజి చిచ్చరపిడుగు. రైటర్‌ దర్శకుడు అయితే... ప్రతి సీన్‌, డైలాగ్‌ మీద ప్రేమతో ఉంచుతారు.  కెమెరామెన్‌ డైరెక్టర్‌ అయితే... ప్రతి షాట్‌లో తన ప్రతిభ చూపించాలనుకుంటాడు. ప్రేమను కూడా పక్కనపెట్టి పనిచేేస వ్యక్తి అంజి. వందో సినిమా వరకూ డైరెక్షన్‌ చేస్తాడు.  నిర్మాతలు ఏడాదికి నాలుగు సినిమాలు చేయాలి’’ అని అన్నారు. 

ఛోటా.కె.నాయుడు మాట్లాడుతూ ‘‘అంజి దర్శకుడు అయ్యాడంటే కుళ్లుగా ఉంది. నేను ఇప్పటికీ డైరెక్షన్‌ చేసే ధైర్యం చేయలేదు. మంచి మాస్‌ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.  

చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ ‘‘మా టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ అందరూ రీయూనియన్‌ అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన పాయింట్స్‌ తీసుకుని సినిమా చేశాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. అలందుకే చాలా ప్రశాంతంగా విడుదల కోసం ఎదురుచూస్తున్నాం’’అని అన్నారు. 

‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ ‘‘సినిమాటోగ్రాఫర్‌గా నా 50వ సినిమాకు నేను డైరెక్షన్‌ చేయాలనే డ్రీమ్‌ నాకు లేదు. మా నిర్మాతకు వచ్చింది. కథ విన్నాను. సుజీత్‌ మంచి స్ర్కీన్‌ ప్లే, డైలాగ్స్‌ రాశారు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్‌ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్‌ పూడికి థాంక్స్‌. ఈ సినిమాకు అవికా గోర్‌ ప్లస్‌ అవుతుంది. ‘96’, ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. 

Updated Date - 2022-01-26T22:50:49+05:30 IST