మార్చి 4న టెంత్‌క్లాస్‌ డైరీస్‌

ABN , First Publish Date - 2022-01-27T05:36:48+05:30 IST

అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘టెంత్‌క్లాస్‌ డైరీస్‌’. సినిమాటోగ్రఫర్‌ ‘గరుడువేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

మార్చి 4న టెంత్‌క్లాస్‌ డైరీస్‌

అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘టెంత్‌క్లాస్‌ డైరీస్‌’. సినిమాటోగ్రఫర్‌ ‘గరుడువేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అచ్యుత రామారావు పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత సి. కల్యాణ్‌, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు.  మార్చి 4న ‘టెంత్‌క్లాస్‌ డైరీస్‌’ను విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.‘ అవికాగోర్‌ ప్రతిభావంతురాలైన నటి. ఈ సినిమాతో ఆమెకు పెద్ద హిట్‌ దక్కాలి’ అని సి.కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఇప్పటిదాకా చేయని పాత్రను ఈ సినిమాలో చేశానని అవికాగోర్‌ అన్నారు. ‘సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అంజి ఈ చిత్రంతో దర్శకుడిగాను సక్సెస్‌ అవ్వాలి’ అని ఛోటా కె.నాయుడు కోరుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అమెరికా, చిక్‌ మగళూరు లాంటి చోట్ల షూటింగ్‌ చేశాం. ప్రతి ఒక్కరికీ తమ స్కూల్‌ డేస్‌ గుర్తుకొస్తాయి’ అని అచ్యుత రామారావు చెప్పారు. ‘ఈ సినిమాకు అవికాగోర్‌ ప్లస్‌పాయింట్‌. పతాక సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను అలరిస్తుంది’ అని ‘గరుడవేగ’ అంజి అన్నారు.


Updated Date - 2022-01-27T05:36:48+05:30 IST