తెలుగు బిగ్‌బాస్‌5 హోస్ట్ మారుతున్నాడా?

తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌నే వార్త‌లు కొన్నిరోజులు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు బిగ్‌బాస్ 5 వ్యాఖ్యాత మార‌బోతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 1ని ఎన్టీఆర్‌, సీజ‌న్ 2ని నాని హోస్ట్ చేయ‌గా సీజ‌న్‌3, సీజ‌న్ 4ల‌ను నాగార్జున హోస్ట్ చేశారు. అయితే బిజీ షెడ్యూల్ కార‌ణంగా నాగ్ ఈసారి అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అందువ‌ల్ల ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించాల‌నుకునే ఈ రియాలిటీ షోకు వ్యాఖ్యాత‌గా రానా ద‌గ్గుబాటిని ఒప్పించ‌డానికి నిర్వాహ‌కులు సంప్ర‌దింపులు జ‌రుపుకుతున్నార‌ని టాక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.