కేసీఆర్ పాత్రలో చేసినందుకు గర్వంగా ఉందంటోన్న యంగ్ హీరో

ABN , First Publish Date - 2021-11-11T00:51:09+05:30 IST

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని

కేసీఆర్ పాత్రలో చేసినందుకు గర్వంగా ఉందంటోన్న యంగ్ హీరో

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న విడుదలవుతున్న సందర్భంగా హీరో జిషాన్ ఉస్మాన్ మీడియాతో ముచ్చటించారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు దర్శకుడు హరీష్ గారు వచ్చి నన్ను కలిశారు. నీతో సినిమా చేయాలని అనుకుంటున్నానని అన్నారు. మా నాన్నగారితో ఈ విషయం చెప్పగానే ఆయన కూడా సరే అన్నారు. అప్పుడే దర్శకుడు నాకు ఈ ‘తెలంగాణ దేవుడు’ కథ వినిపించాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్ అని తెలిసి కథ బాగా నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. కేసీఆర్‌గారు ఉద్యమకారుడిగా అప్పుడు పోరాడిన విధానం.. నాలో ఎంతో స్పూర్తి నింపింది. ఈ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. ఈ సినిమా కథ విన్నాకే నాకు తెలంగాణ ఉద్యమం గురించి పూర్తిగా తెలిసింది.


సినిమాలో నాకు జంటగా సుష్మిత నటించింది. నా పాత్ర స్కూలింగ్ డేస్ నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఉంటుంది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. దర్శకుడు హరీష్‌గారికి ఇది ప్రెస్టీజీయస్ మూవీ. అలాగే శ్రీకాంత్‌గారు నాకు ఎన్నో మెళుకువలు నేర్పారు. ఆయన సహకారం మరిచిపోలేనిది. నిజంగా కేసీఆర్‌గారి పాత్రలో నటించినందుకు చాలా గర్వంగానూ, ఛాలెంజింగ్‌గానూ అనిపిస్తోంది. నవంబర్ 12న చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2021-11-11T00:51:09+05:30 IST